గాంధారి మండల కేంద్రంలో పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతిరాం నాయక్ కార్యదర్శి ప్రకాష్ నాయక్ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. భూములకు రుణాలు ఇవ్వాలని ఆరు మాసాల నుంచి బ్యాంకుల చుట్టూ కలెక్టర్ల చుట్టూ తిరిగిన ఫలితం రాలేకపోయింది పంట పెట్టుబడి కోసం దళారులకు అశ్రయించి మూడు రూపాల వడ్డీతో పేద రైతులు నష్టపోతారు.వారంలో ప్రారంభించక పోతే జిల్లా కలెక్టర్ ను దిగ్భంధం చేస్తామని నాయకులు తమ డిమాండ్ పత్రాన్ని బ్యాంకు మేనేజర్ ని ఇవ్వడం జరిగిందని తెలిపారు.