ఓ ప్రమాదం రెండు కుటుంబాలలో విషాదం మిగిల్చింది. 2 బైక్ లు ఢీకొన్న ఘటనలో దాదిగూడెం గ్రామానికి చెందిన నర్సింగరావు అక్కడికక్కడే మృతి చెందిన విషయం విధితమే. ఇదే ఘటనలో మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన మహేశ్ (26)కు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. బాధిత మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.