ఆక్వా రంగంపై ట్రంప్ సుంకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిప్పి కొట్టాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు.వేటపాలెంలో మంగళవారం ట్రంప్ సుంకాలు- ఆక్వా రంగంపై ప్రభావం అనే అంశంపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది.ఈ సమావేశంలో ఆక్వా అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రొయ్యల పరిశ్రమపై అదనంగా 30 శాతం ట్రంపు సుంకాల భారం పడితే ఆక్వా రైతులు వీధిన పడతారన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.