పెడన పట్టణంలో పూరీల్లు దగ్ధం స్తానిక పెడన పట్టణంలోని 22వ వార్డులో పూరిల్లు దగ్ధమైన ఘటన. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బాధితుడు తాడిశెట్టి సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 22వ వార్డులో గల పూరింట్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలి బూడదైంది. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు గాని ప్రాణ నష్టం జరగలేదు. ఎంత ఆస్తి నష్టం జరిగిందన్న విషయంపై సంబంధిత అధికారులు అంచనా వేయాల్సి ఉంది.