కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో 29 గ్రామాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గ్రామ , మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటర్ డ్రాఫ్ట్ జాబితా, డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా ప్రదర్శించినట్లు మండల ఎంపీడీవో యాదగిరి గురువారం తెలిపారు. మండలంలో పురుష ఓటర్లు16,115 మంది ఉండగా, స్త్రీ ఓటర్లు 16,994 ఉన్నట్లు తెలిపారు. మొత్తం 33, 110 ఓటర్లు ఉండగా, 254 వార్డులు, 254 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు.