పాతబస్తీలోని మీర్చౌక్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్(RAF) ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, డీసీపీ సౌత్ జోన్ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో ఈ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పర్యవేక్షణ, ప్రజల్లో భద్రత పట్ల విశ్వాసం పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ ఫ్లాగ్ మార్కు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాయకత్వం వహించారు.