ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమం కౌన్సిలర్ మాధవి శనివారం సందర్శించారు. HIV/ AIDS వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ ఆరోగ్యమిషన్ APSHWP.org వెబ్సైట్ ద్వారా పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గంగన్న, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.