కనిగిరి ఆర్టీసీ డిపోలో సూపర్వైజర్ గా పని చేస్తున్న శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కేశవరావు డిపో మేనేజర్ సయనా బేగం కు శనివారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ కనిగిరి ఆర్టీసీ డిపోలో 21 మంది స్వీపర్లుగా, వాషర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, వారికి వచ్చే కొద్దిపాటి జీవితంలో తనకు కమిషన్ ఇవ్వాలంటూ సూపర్వైజర్ తన సొంత ఖాతాకు కార్మికుల జీతంలోని కొంత నగదును మళ్లించుకుంటున్నారన్నారు. కార్మికుల పొట్ట కొడుతున్న సూపర్వైజర్ శ్రీనివాసులు పై చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ కు కేశవరావు లిఖిత పరవకంగా వినతి పత్రం అందజేశారు.