మైక్రో ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి ని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి ఎస్పీ మీడియా తో మాట్లాడుతూ.. ఎస్. కె మైక్రో ఫైనాన్స్ పేరుతో కృష్ణ అనే వ్యక్తి సుమారు 300 మంది నుండి 20 వేల నుండి లక్షల వరకు వసూలు చేశారన్నారు. అరెస్టు చేసిన నిందితుని నుండి 9 లక్షల నగదు, 10.7 తులాల బంగారం స్వాదీనం చేసుకున్నామన్నారు.