దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామంలోని గణనాథుడిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గురువారం రాత్రి దర్శించుకున్నారు. వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. టీడీపీ దగదర్తి మండల అధ్యక్షుడు అల్లం హనుమంతరావు, రాష్ట్ర కార్య దర్శి పమిడి రవికుమార్ చౌదరి, జలదంకి శ్రీహరి నాయుడు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమం గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగింది.