గతంలో ప్రజా దర్బార్ లో మోచంపేట ఉర్దూ స్కూల్‌లో క్లాస్‌రూమ్ పరిస్థితులు సరిగా లేవని, ఫ్లోరింగ్ మరియు పెయింటింగ్ పనులు అవసరమని పాఠశాల హెడ్‌మాస్టర్ మేడం వివరించిన నేపథ్యంలో, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు స్వయంగా పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఆ తరువాత పి–4 మోడల్ కింద రాష్ట్ర మైనారిటీ వైస్‌ప్రెసిడెంట్ డాక్టర్ జిలాని గారి సహకారంతో అవసరమైన పనులను పూర్తి చేయించారు. ఈ సహకారం పట్ల కృతజ్ఞతగా, పాఠశాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తిస్తూ మాధవి డాక్టర్ జిలానిని సన్మానించారు.