జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం గ్రామంలో నీలి నాలిక వ్యాధి (Blue Tongue Disease - BTV) నివారణకు చర్యలు చేపట్టారు. మండల పశువైద్య అధికారి డాక్టర్ విశ్వ చైతన్య ఆధ్వర్యంలో టీకాలను పంపిణీ చేశారు. Way 2News తో అయన మాట్లాడుతూ..నీలి నాలిక ఒక వైరల్ వ్యాధి. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో కనిపించే మశకాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని నిరోధించేందుకు టీకాలు అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం అన్నారు.