భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కప్పల వాగు నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేసేందు తవ్వకాలు చేస్తున్న ఒక జెసిబి, రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. అయితే రాత్రి సమయాల్లో JCBతో ట్రాక్టర్ లో ఇసుకను లోడ్ చేసి, అక్రమ రవాణా చేస్తున్నారనీ స్థానికుల సమాచారం మేరకు యస్ ఐ. సందీప్ సిబ్బందితో వెళ్ళి దాడి చేశారు. ఇసుకను నింపుతున్న జేసిబితో పాటు రెండు ట్రాక్టర్ను సీజ్ చేశారు. వాహనాల యజమానులు అయిన ఈర్ల మహేందర్, మల్లెల స్వామి, దేశబోయిన రవికుమార్ల ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించిన్నట్ట్టు యస్. ఐ తెలిపారు. ఈ