నరసాపురాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కోరారు. శనివారం పట్టణంలోని రాయిపేట నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకూ మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు వినతిపత్రం అందజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విజ్ఞప్తి తీసుకెళ్లాలని మాధవ నాయుడు కోరారు.