అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని నరసాపురం గ్రామ సమీపంలో రైతు దొడగట్ట కిష్టప్ప తోట వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ట్రాన్స్ పార్మర్ పగులుగొట్టి అందులోని రాగి వైరను చోరీ చేశారు. గురువారం తోట వద్దకు వెళ్ళిన రైతు కిష్టప్ప తోట సమీపంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పగలగొట్టి ఉండటంతో ఆవేదన చెందాడు. ఘటనపై బెలుగుప్ప స్టేషన్ ఎస్ఐ శివ కు, బెలుగుప్ప మండల విద్యుత్ శాఖ ఏఈ గంగాధర్ కు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలాన్ని బెలుగుప్ప పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు.