సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నూతన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా సోమవారం సిహెచ్. కుశల్కర్ భాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బి. అనురాధను అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిహెచ్. కుశల్కర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేశారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు సీపీ అనురాధ సిహెచ్. కుశల్కర్ ను అభినందించారు. సిహెచ్. కుశల్కర్ 1995 ఎస్ఐగా పోలీస్ డిపార్ట్మెంట్లో అరంగేట్రం చేశారు . ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో పనిచేశారు,2008 సంవత్సరంలో సీఐగా ప్రమోషన్ పొంది ఉమ్మడి నిజాంబాద్, మరియు హైదరాబాద్ సిటీలో పనిచేశారు.