నల్గొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లోని ఒకటో నెంబర్ వినాయకుని వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారి తీసింది. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై డిఎస్పి, సీఐ వ్యవహరించిన తీరును మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. నాగం వర్షిత్ రెడ్డి పై డిఎస్పి, సీఐ వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.