ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపును హర్షిస్తూ ఈరోజు నేరేడుచర్ల పట్టణంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలాత రెడ్డి మాట్లాడుతూ పేదలపై భారం పడకుండా నరేంద్రమోదీ జీఎస్టీని తగ్గించారన్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు లాభం చేకూరుతుందన్నారు.