రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి పేద కుటుంబాలకు చెందిన వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు. నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్తో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వైఎస్సారను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మరోపక్క చోడవరం పట్టణంలోని కొత్తూరు జంక్షన్ లో వైఎస్ఆర్ విగ్రహానికి మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పూలమాల విసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు