శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం LRG కళాశాలలో విప్రో కేర్స్ సహకారంతో వాసవ్య మహిళా మండలి,తుమకుంట చెకపోస్ట్ కుశల్ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థి, విద్యార్థినిలకు మత్తు పదార్థాల వల్ల పెరుగుతున్న దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సైక్రియాటిస్ట్ డా. జీవన మాట్లాడుతూ, “డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలు శరీరాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇవి జీర్ణక్రియ సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, మెదడు పనితీరు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తాయి. అంతేకాదు ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ఆత్మహత్యా