చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్. మంగళవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యూరియా గిడ్డంగిలను తనిఖీ చేసి యూరియా నిల్వల రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు యూరియా సరఫరా చేస్తామని అన్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాము, ఏవో. రాధా. వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.