అనకాపల్లి పట్టణంలోని శారదా నది ఘాటు వద్ద వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులను ఆదేశించారు, శనివారం వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా శారదా నది ఘాట్ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.