పెద్ద చెర్లోపల్లి తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెదచెర్లోపల్లి మండలంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని రైతుల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఒకరి పేరు మీద ఉన్న భూమిని, మరొకరి పేరు మీదకు అక్రమంగా ఆన్లైన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.