కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పత్రాలను గురువారం దగ్ధం చేశారు. డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షల అవకతవకల పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, వివాదాలకు నిలయంగా ఉన్న TGPSC నీ ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. TGPSC చేసిన తప్పిదాల వల్ల రెండుసార్లు ప్రిలిమ్స్ రద్దు కావడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ల దగ్గర నుంచి పరీక్ష పూర్తయి పేపర్లు దిద్దే వరకు వరుస వివాదాలతో ఉన్న TGPSC పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.