బెల్లంపల్లి పట్టణం గాంధీ చౌరస్తాల గల దత్తాత్రేయ మెడికల్ షాపు ముందు ఒక వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో రౌడీ షీటర్ అఖిల్ ను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ రావు తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మెడికల్ షాపు నుండి సతీష్ అనే వ్యక్తిని బయటకి రమ్మని బండరాయితో కొట్టి కింద పడవేసి గొంతుపై కాలు పెట్టి హత్యయత్నం చేసినట్లు తెలిపారు ఫిర్యాదు దారుడు అక్కడ నుండి తప్పించుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు అఖిల్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు