పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని యనమదుర్రు డ్రెయిన్‌పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్‌లు వేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ ప్రశ్నించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెన నిర్మాణం పూర్తిచేసి అప్రోచ్ రోడ్లు వేయకుండా సంవత్సరాల తరబడి అసంపూర్తిగా వదిలేసిన వంతెనలను సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పరిశీలించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా గోపాలన్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ప్రజా సమస్యలను, వినతులను దృష్టిలో పెట్టుకుని ఈ యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.