గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రోడ్ల వెంబడి స్వీపింగ్ క్రమ పద్దతిలో రోడ్, డివైడర్ వెంబడి సమగ్రంగా శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జీటి రోడ్, నల్లపాడు, జేకేసి కాలేజీ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికులు రోడ్ల ప్రధాన రోడ్లను శుభ్రం చేసేప్పుడు తప్పనిసరిగా సెంట్రల్ డివైడర్ వెంబడి కూడా శుభ్రం చేయాలన్నారు.