భీంగల్ పట్టణ కేంద్రంలోని ఆదివారం ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రహమాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్ మాట్లాడుతూ, గత రెండు రోజుల కిందట జిల్లాలోని నందిపేట్ మండలం కోదాన్పూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చదువు నేర్పే గురువులు విద్య నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మానవత్వం మర్చిపోయి కొందరు విద్యార్థులకు కండ్లు,ముక్కులో, చెవులో,కారం చల్లడంతో ఇంటికి వెళ్ళిన విద్యార్థులకు తల్లిదండ్రులు పాఠశాలలో ఏం జరిగిందని అడగగా ఈ స్కూల్ లో అల్లరి చేస్తున్నామని పాఠశాల ఉపాధ్యాయుడు, ఇష్టానుసారంగా కొట్టడం జరిగిందన్నారు.