రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లోని మట్టి నాగులపల్లి ప్రాంతంలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫైర్ మాన్ పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. 483 మంది కొత్తగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి పాసింగ్ అవుట్ పెరేడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరియు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.