యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండల పరిధిలోని దేవులమ్మ నాగారం చెరువును సిఐ మన్మధ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయని, వాగులు దాటడం, ఫోటోలు దిగడం, ఈత కొట్టడం వంటివి చేయవద్దని యువకులకు సీఐ మన్మధ కుమారు సూచించారు.