సినీ హీరో నారా రోహిత్ ఆదివారం గుంటూరులో సందడి చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆరో గణపతి మహోత్సవాలలో ఆయన ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని నారా రోహిత్ తెలిపారు. నిమజ్జనం సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుంటూరు నగరంలో ఇంత ఘనంగా గణపతి ఉత్సవాలను నడపడం ఆనందంగా ఉందన్నారు.