Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: బ్యాంక్ అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశం

Kamareddy, Kamareddy | Sep 6, 2025
కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ , కామారెడ్డి ఆధ్వర్యంలో శనివారం డా. సూర సుమలత ఇన్‌చార్జి కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికారం, కామారెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఆదేశాల మేరకు, ఈ నెల 13న జరగబోయే జాతీయ లోకఅదాలత్ సందర్భంలో కేసుల పరిష్కారం కోసం, జిల్లా బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, రూ.50,000, రూ.1,00,000 లోపు ఉన్న డిఫాల్టు ఖాతాలను లోకఅదాలత్‌లో పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వీధి వ్యాపారులకు అందజేయబడిన ప్రధాన మంత్రి స్వనిధి రుణాలు సకాలంలో పరిష్కరించకపోతే వారి సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us