ఆసిఫాబాద్ లో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. గురువారం మధ్యాహ్నం ఆసిఫాబాద్ పెద్దవాగు వద్ద నిమజ్జన ప్రదేశాన్ని పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్లో కలిసి పరిశీలించారు. శోభాయాత్ర వాహనాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.