Download Now Banner

This browser does not support the video element.

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో టోకరా, ఎస్పీ దామోదర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు, సత్వర విచారణకు ఆదేశాలు

Ongole Urban, Prakasam | Aug 25, 2025
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి కొందరు వ్యక్తులు తమను మోసగించారని పలువురు నిరుద్యోగులు సోమవారం ఒంగోలులో జిల్లా ఎస్పీ దామోదర్ కు ఫిర్యాదు చేశారు. తమ దగ్గర నుండి దాదాపు 5 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసి కొనకనమిట్టలోని ఒక ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు ఇచ్చి వారు పరారయ్యారన్నారు.ఈమధ్యే ఆ కంపెనీ తమను సదరు ఉద్యోగాల నుండి కూడా తీసివేసిందని వారు ఎస్పీకి చెప్పుకున్నారు.ఈ ఘటనపై విచారణకు ఎస్పీ దామోదర్ ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us