సాధారణ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సామాజిక మాధ్యమాల ప్రచారాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోoదని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా అన్నారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుండి ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయడంలో మీడియా సర్టిఫికేషన్ సమన్వయ కమిటీ కీలక భూమిక పోషిస్తోందన్నారు. అన్నివే ళలా అందుబాటులో ఉండి ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో వచ్చే వార్తలు, ప్రకటనలు ఇతర అంశాలపై పరిశీలన చేస్తోందన్నారు.