చండ్రుగొండ మండలం గానుగాపాడు సహకార సంఘం సొసైటీ కార్యాలయం ఎదుట యూరియా బస్తాల కోసం బారులు తీరిన రైతన్నలు, క్యూ లైన్ లో చెప్పులు పెట్టి సొసైటీ కార్యాలయం ఎదుట శనివారం నిరసన..యూరియా నిల్వలు తక్కువగా 80 బస్తాలు మాత్రమే ఉండటంతో వచ్చిన రైతులకు కేవలం ఒక్క బస్తా ఇస్తున్న సహకార సంఘం సొసైటీ అధికారులు..కొంతమంది రైతులకు మాత్రమే యూరియా సరఫరా కాగా , మిగిలిన రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.దీంతో సొసైటీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఒక ఎకరానికి నాలుగు నుండి ఐదు బస్తాలు సరఫరా చేయాల్సి ఉండగా ఒకటి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు