గుంటూరు మిర్చి యార్డు వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో పవన్ కళ్యాణ్ అందరి మన్ననలు పొందుతున్నారని, పేదల అభివృద్ధే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో అందరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం అభినందించారు.