పోషణ్ ట్రాకర్ యాప్ లో ఫేస్ క్యాప్చర్ frs విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఆన్లైన్ యాప్ విధానం ఉండేలా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున అంగన్వాడీలు ప్రదర్శన నిర్వహించి గంటపాటు ధర్నా చేశారు. ఎఫ్ ఆర్ ఎస్ విధానం రద్దు చేయాలని ఒకే ఆన్లైన్ యాప్ విధానం ఉండాలని అంగన్వాడీల ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.