మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిలో కార్మికులు శనివారం ఉదయంఆందోళన చేపట్టారు. ఒక్కరోజు గైర్హాజరైన కార్మికులకు అధికారులు నోటీసులు జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేస్తూ నిరసన తెలిపారు. వీరికి ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు. అనారోగ్యం, ఇతర సమస్యలతో ఒక్కరోజు గైర్హాజరయితే నోటీసులు ఎలా ఇస్తారంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు నోటీసులు ఉపసంహరించుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు