ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామ సమీపంలో ఉన్న పత్తి జిన్నింగ్ యజమాని ప్రమాదవశాత్తు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. జిన్నింగ్ మిల్లు యజమాని తగ్గరే పరుశురాం తన జిన్నింగ్ మిల్లులో యంత్రాల మరమ్మతులను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో పడి ఇరుక్కున్నాడు. దీంతో తీవ్ర గాయాలుకాగా అతన్ని జిల్లా కేంద్రంలోని రిమ్స్ అసువత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందాడు.