నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండల పోలీస్ స్టేషన్ ను డిఐజి ఎల్. హెచ్. చౌహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి, ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామలాల్ తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.