తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 600 మంది పోలీసులు హుటాహుటిన తాడిపత్రికి బయలుదేరారు. పట్టణంలో ఇప్పటికే 428 పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు.