జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దరేవల్లికి చెందిన మైబు అనే వ్యక్తి తన చికెన్ సెంటర్ పై దాడి జరిగిందని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థలం విషయంలో తనకు సంబంధం లేకపోయినా పక్క ఫ్లాట్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు తనపై దాడి చేసి గాయపరిచారని మైబు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడిలో గాయపడిన మైబు ప్రస్తుతం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.