చిత్తూరు జిల్లా.పుంగనూరు మండలం బోనెపల్లి క్రాస్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎం.సి .కొత్తూరు గ్రామానికి చెందిన గణేష్ 23 సంవత్సరాలు ద్విచక్ర వాహనంలో పుంగనూరు నుంచి గ్రామానికి వెళుతుండగా బోనేపల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనం బోల్తాపడి గణేష్ గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గణేష్ ను స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు.