వాంకిడి మండలం దాబా గ్రామంలోని చికిలివాగు మడుగులో పడి నలుగురు మృతి చెందినట్లు వాంకిడి సీఐ సత్యనారాయణ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. దాబాకి చెందిన నిర్మల బాయి అనే యువతి యూరియా ఖాళీ బస్తాలను కడుక్కోవడానికి మడుగు దగ్గరికి వచ్చిందన్నారు. నిర్మలతో పాటు ఆమె కొడుకు గణేష్,వారి బంధువుల ఇద్దరు పిల్లలు వాగు మడుగు వద్దకు వచ్చారు. పిల్లలు మడుగులో ఆడుకోవడానికి దిగారు.మడుగులో లోతు ఎక్కువగా ఎండడంతో ముగ్గురు పిల్లాలు ముంగిపోగా వాళ్లను కాపాడడానికి వెళ్లిన నిర్మలా కూడా మడుగులో పడి చనిపోయినట్లు సీఐ పేర్కొన్నారు.