రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా అధికారులను శుక్రవారం సాయంత్రం ఆదేశించారు. నిర్వాహకులతో ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేసి, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేయాలన్నారు. మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని తెలిపారు.