పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద గొట్టి గ్రామానికి ప్రభుత్వం మంజూరు చేసిన డిపట్ట భూమికి వెంటనే హద్దులు చూపించి అప్పచెప్పాలని కోరుతూ లబ్ధిదారులతో కలిసి CPM పార్టీ ఆధ్వర్యంలో సోమవారం1pm నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గొట్టి గ్రామానికి చెందిన దళితులు మరియు బీసీ కులానికి చెందిన సుమారు 32 మంది పేదవారికి గతంలో కెమిశీల రెవెన్యూ పరిధిలో డిపట్టా భూములు మంజూరు చేయడం జరిగింది.