నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణం ప్రశాంతంగా ఉందని ఫేక్ ప్రచారాలు నమోదని డిఎస్పి రామాంజి నాయక్ తెలిపారు.. వినాయక నిమజ్జనం సమయంలో కొంత అసత్య ప్రచారాల వల్ల డిస్టర్బ్ అయిందని, కానీ జిల్లా ఎస్పీ కర్నూల్ డిఐజి వచ్చి సమస్యను పరిష్కరించారని ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని అన్ని మతాలు ఒకటేనని ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలని డి.ఎస్.పి రామాంజి నాయక్ తెలిపారు.. ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.