విశాఖపట్నం మేఘాదిగడ్డ రిజర్వాయర్లో ఆదివారం ఇద్దరు యువకులు మృతి చెందారు. కార్మికనగర్, JNRM కాలనీకి చెందిన యువకులు చేపలు పట్టడానికి రిజర్వాయర్కి వచ్చారు. కింద పడిన చెప్పు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వీరిలో బెల్లంకి శేఖర్, లక్ష్మణ్ కుమార్ చనిపోయారు. మరో యువకుడు వాసును స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసిందని పోలీసులు పేర్కొన్నారు