రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పాడేరులోని పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 141మంది అభ్యర్థులు హాజరయ్యారు. జాబ్మేళాకు 51మంది ఎంపికైయినట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ హరిబాబు తెలిపారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి మెరుగుపరచుకోవాలని తెలిపారు.